2023లో 100 కోట్ల కలెక్షన్లను అందుకున్న తెలుగు సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
పోయిన సంవత్సరం అనేక తెలుగు సినిమాలు థియేటర్ లలో విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుని 100 కోట్లకు పైగా కలెక్షన్ లను అందుకున్నాయి. అలా పోయిన సంవత్సరం 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టిన సినిమాలు ఏవి అనే విషయాలను తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ పోయిన సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది. ఈ మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్ లను రాబట్టి చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బాస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరిపోయింది.

నందమూరి నట సింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన వీర సింహా రెడ్డి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకొని 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

ధనుష్ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో సార్ అనే బైలింగ్వల్ సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

నాని హీరో గా రూపొందిన దసరా సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

పవన్ , సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా రూపొందిన "బ్రో" సినిమా కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను రాబట్టింది.

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి మూవీ మంచి విజయాన్ని అందుకొని 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం కూడా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: