తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో కృష్ణ వంశీ ఒకరు. తన కెరియర్ లో ఎన్నో డిఫరెంట్ సినిమాలకు దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రియేటివ్ దర్శకుడుగా పేరు సంపాదించుకున్నాడు. ఇకపోతే కృష్ణ వంశీ తన కెరియర్ లో దర్శకత్వం వహించిన బ్లాక్ బాస్టర్ సినిమాలలో రాఖీ మూవీ ఒకటి. ఈ మూవీ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించగా ... గోవా బ్యూటీ ఇలియానా , బ్యూటిఫుల్ నటి చార్మి ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ లుగా నటించారు.
ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. చాలా సంవత్సరాల క్రితం భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ముఖ్యంగా ఈ మూవీ లోని ఎన్టీఆర్ నటనకు అలాగే ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానానికి కృష్ణ వంశీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ మూవీ ని కృష్ణ వంశీ సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందించాడు.
ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా రాఖీ సినిమా అభిమాని కృష్ణ వంశీ ని రాఖీ మూవీ కి కొనసాగింపుగా "రాఖీ 2" ప్లాన్ చేస్తున్నారా సార్ అని ప్రశ్నించాడు. దీనికి కృష్ణ వంశీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ... అది చాలా కష్టం అండి , రాఖి మళ్ళీ తీసుకురాలేం. అదొక అదృష్టం , అద్భుతం అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే కృష్ణ వంశీ తాజాగా రంగ మార్తాండ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇందులో ప్రకాష్ రాజ్ , బ్రహ్మానందం , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.