అఫీషియల్ : "అయాలాన్" ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో శివ కార్తికేయన్ ఒకరు. ఈయన ఇప్పటికే అనేక తమిళ సినిమాలలో నటించి అందులో చాలా మూవీలలో అద్భుతమైన విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ నటుడు ఇప్పటికే తాను నటించిన చాలా సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో ఈ నటుడి కి తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ఈయన ఆఖరుగా మా వీరన్ అనే సినిమాలో హీరో గా నటించాడు.
 


ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. తెలుగు లో ఈ సినిమా మహా వీరుడు పేరుతో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా తమిళ్ లో సూపర్ సక్సెస్ అందుకోగా తెలుగు లో పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ నటుడు "అయాలాన్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా ... ఆర్ రవి కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.


ఈ సినిమాను జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ ను జనవరి 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: