సినిమాలు ఎప్పుడూ దర్శకుడు మొదటగా ప్లాన్ చేసిన విధంగా కంప్లీట్ అవ్వవు. కథ మారొచ్చు,
హీరోయిన్ మారచ్చు, లేదంటే ఏకంగా హీరోనే చేంజ్ అవ్వచ్చు.
హీరో చేంజ్ అవ్వడానికి చాలానే కారణాలు ఉంటాయి.ఉదాహరణకి హీరోకి కథ నచ్చకపోవచ్చు. లేదంటే తాను ఆ
సినిమా చేయలేనని అనుకోవచ్చు. డేట్స్ కుదరకపోవచ్చు, ఇంకా
సినిమా చేయకపోవడానికి వేరే కారణాలు ఏవైనా ఉండొచ్చు. అయితే హీరోలు ఒక్కోసారి తాము చేయలేమని ఒక సినిమాని రిజెక్ట్ చేయడమే కాక ఆ సినిమాకి ఎవరు బాగా సూట్ అవుతారో కూడా చెప్పగలరు.అలా చెప్పిన వారిలో మహేష్ బాబు కూడా ఉన్నాడు. అతను తన వద్దకు వచ్చిన
డార్లింగ్ సినిమా స్టోరీని బాగా లైక్ చేశాడు కానీ ఆ పాత్రకు తాను సూట్ అవ్వను అని
డైరెక్టర్ కి నేరుగా చెప్పాడు. ఆ తర్వాత
డార్లింగ్ హీరో రోల్ కి
ప్రభాస్ కరెక్ట్ గా సూట్ అవుతాడని సూచించాడు.
డైరెక్టర్ ఎ.
కరుణాకరన్ కూడా మహేష్ బాబుతో అంగీకరించి
ప్రభాస్ ని సంప్రదించాడు.యంగ్ రెబెల్ స్టార్
ప్రభాస్ కి కూడా ఆ
సినిమా స్టోరీ బాగా నచ్చేసింది. ఆ పాత్ర తాను బాగా చేయగలను అనే నమ్మకంతో వెంటనే ఓకే చెప్పేసాడు. అంతకుముందే మహేష్
ప్రభాస్ కి ఈ
సినిమా గురించి చెప్పాడట. దాంతో ఈ కథను అతడు మిస్ కాకుండా విన్నాడు, ఇందులో చాలా అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్నలను పొందాడు. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ
సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.55 కోట్లు వసూలు చేసి
బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.ఈ మూవీలో
ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు. కొత్త హెయిర్ స్టైలుతో స్మార్ట్ గా కనిపించి అమ్మాయిల హృదయాలను దోచేశాడు. నిజానికి ఈ
సినిమా తీసిన తర్వాతే అతడిని అమ్మాయిలు
డార్లింగ్ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ సినిమాలో
కాజల్ కూడా చాలా బాగా నటించింది.ఆమె ఎక్స్ప్రెషన్స్ ఈ మూవీకే పెద్ద హైలైట్ అయ్యాయి.
కామెడీ కూడా బాగానే వర్క్ ఔట్ అయ్యింది. పాటలు కూడా మనసును హత్తుకునేలా ఉంటాయి. మొత్తం మీద ఈ
మూవీ ప్రభాస్ కెరీర్లో ఒక బిగ్గెస్ట్
బ్లాక్ బస్టర్ గా నిలిచింది.