నటి, మినిస్టర్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం టీడీపీ, జనసేన నేతలపై విరుచుకుపడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా పేరున్న రోజా సూపర్ హిట్ మూవీస్ అందించి ఏంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అలాగే ఇప్పుడు రాజకీయాల్లో కూడా క్రియాశిలకంగా వ్యవహారిస్తూ తన దైన స్టైల్ లో దూసుకుపోతుంది.అయితే ఆమె కున్న నోటి మాటకు ప్రతిసారి ప్రతిపక్షం నుండి ఎదో ఒక వ్యాఖ్యలు అందుకుంట ఉంటది.ఒకప్పుడు జబర్దస్త్ కు జడ్జిగాఉన్న రోజా మినిస్టర్ అయ్యాక పూర్తిగా రాజకీయాలకు అంకితమయ్యింది. ఇక రోజాకు వివాదాలు కొత్తేమి కాదు. ఎంతోమంది ఆమెను విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా వివాదంలో చిక్కుంది. రోజా ఈ ఏడాది న్యూయర్ సెలబ్రేషన్స్‌ను బెంగుళూరులో జరుపుకుంది. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి బెంగళూరులో న్యూ ఇయర్‌కు ఘనంగా స్వాగతం పలికింది. బెంగళూరు పబ్‌లో డ్యాన్సులు చేస్తూ.. పాటలకు లయబద్దంగా స్టెప్పులు వేస్తూ నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలు బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ వేసుకొని.. రోజా డ్యాన్స్ వేస్తూ కనిపించింది.ఇక ఈవీడియోపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో అంగన్వాడీలు, పారిశుధ్య కార్మికులు, రోడ్లపై నిరసనలు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఇవేమి పట్టవా? బెంగళూరు పబ్బులో చిందులు వేస్తున్నావ్.. నువ్వు మంత్రివేనా.. ? అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే రోజా.. గతంలో మంత్రిగా ఉన్న అఖిల ప్రియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">భూమా అఖిల ప్రియా నంద్యాల ఉప ఎన్నికల్లో పంజాబీ డ్రెస్ వేసుకొని ప్రచారం చేయడంతో రోజా తీవ్రస్థాయిలో కామెంట్స్ చేసింది.. ఇప్పుడు ఆమెనే ఇలా డ్యాన్స్ చేస్తూ కనిపించింది.. దీని గురించి మాట్లాడారా.. ? అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ వీడియో పై రోజా ఎలాంటి కామెంట్స్ చేస్తుందో చూడాలి.