సినీ నటి
రకుల్ ప్రీతి సింగ్ ఒకానొక సమయం లో తెలుగు తమిళ భాష చిత్రాల లో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ గా ఉన్నారు. అయితే ఇటీవల ఈమె సౌత్
సినిమా లకు పూర్తిగా దూరం గా ఉంటూ
బాలీవుడ్ సినిమాలలోనే బిజీ గా గడుపుతున్నారు.ఇలా
బాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిమితమైనటు వంటి ఈమె
బాలీవుడ్ నటుడు
నిర్మాత జాకీభగ్నాన్ని
ప్రేమ లో ఉన్నారు. ఇలా వీరిద్దరూ గత కొంత కాలంగా
ప్రేమ లో ఉంటూ వీరి
ప్రేమ విషయాన్ని సోషల్
మీడియా వేదిక గా అభిమానుల తో పంచుకున్నారు.ఇలా
ప్రేమ విషయాన్ని తెలియజేయడం తో వీరిద్దరూ స్వేచ్ఛ గా వారికి నచ్చిన ప్రదేశాలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇలా గత రెండున్నర సంవత్సరాల నుంచి డేటింగ్ లో ఉన్నటువంటి వీరిద్దరూ త్వరలోనే
పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రకుల్ జాకీ ఇద్దరు కూడా
ఫిబ్రవరి 22వ తేదీ
గోవా లో
పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం
బాలీవుడ్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.ఇక త్వరలోనే వీరి
పెళ్లి జరగబోతున్నటువంటి నేపథ్యం లో ఇప్పటికే
పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయని ఇందులో భాగంగానే వీరిద్దరూ తమ స్నేహితులకు గ్రాండ్ గా బ్యాచిలర్
పార్టీ కూడా ఇచ్చారని ఈ
పార్టీ బ్యాంకాక్ లో ఇచ్చారు అంటూ కూడా తెలుస్తుంది. ఈ విధంగా
రకుల్ తన ప్రియుడు తో
పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారుఅయితే వీరి వివాహం గోవాలో అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరగబోతుందని సమాచారం. ఇలా వీరి
పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నప్పటికీ
రకుల్ మాత్రం ఈ విషయం గురించి ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.