భీమాతో హిట్టు కొట్టేందుకు రెడీ అవుతున్న గోపిచంద్?

Purushottham Vinay
భీమాతో హిట్టు కొట్టేందుకు రెడీ అవుతున్న గోపి చంద్ ?


టాలీవుడ్ లో మంచి యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీ చంద్‌ ప్రస్తుతం హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. గత కొంతకాలంగా ప్లాపుల్లో ఉన్న గోపి చంద్ స్ట్రాంగ్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో గోపీచంద్ ఒక సినిమాను చేస్తున్న సంగతి తెల్సిందే. చాలా రోజుల క్రితం ఈ సినిమాను ప్రకటించడం జరిగింది.ఈ సినిమా  ప్రకటించిన సమయంలో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఈ మధ్య కాలంలో ఎలాంటి హడావుడి లేకపోవడంతో అసలు సినిమా ఏమైంది అనే చర్చ కూడా మొదలైంది.ఈ కొత్త సంవత్సరం కానుకగా గోపీచంద్‌, హర్ష సినిమా ఫస్ట్‌ లుక్ ను విడుదల చేయడం జరిగింది. భీమా అనే టైటిల్ తో ఈ మూవీని గోపీచంద్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. 



ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్‌ కనిపించబోతున్నాడని గతంలోనే ప్రకటన వచ్చిన సంగతి తెల్సిందే.తాజాగా పోలీస్‌ ఆఫీసర్ గెటప్ లో హీరో గోపీచంద్ ను చూపిస్తూ భీమా టైటిల్‌ తో పోస్టర్ ను విడుదల చేసి ప్రేక్షకులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలను యూనిట్‌ సభ్యులు తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా  షూటింగ్‌ మంగళూరు సిటీలో జరుగుతున్నట్లుగా యూనిట్ సభ్యులు తెలియజేశారు.దట్టమైన అటవీ ప్రాంతంలో గోపీచంద్ ఇంకా కొందరి పై యాక్షన్ సీన్స్ షూటింగ్ జరుపుతున్నారు. కేజీఎఫ్ మరియు సలార్‌ సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేసిన రవి బస్రూర్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. ఈ సినిమాలో మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్‌ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సక్సెస్ కోసం వెయిట్‌ చేస్తున్న గోపీచంద్‌ కు ఈ సినిమా 2024 లో ఆ సక్సెస్‌ ను ఇస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: