సలార్ మూవీతో.. చరిత్ర సృష్టించిన ప్రభాస్?

praveen
బాహుబలి సినిమాకు ముందు టాలీవుడ్ లో రెబల్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా డార్లింగ్ గా కొనసాగిన ప్రభాస్ రేంజ్ ఇక బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక ఈ మూవీతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. తన యాటిట్యూడ్ తోను కేవలం టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ప్రేక్షకుడికి డార్లింగ్ గా మారిపోయాడు అని చెప్పాలి.

 అయితే బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రభాస్ చేసిన ఏ సినిమా కూడా పెద్దగా విజయం సాధించలేదు. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ అయితే పెరుగుతూ వచ్చింది. కానీ సినిమాలలో మాత్రం హిట్ అనే పదం ప్రభాస్ కి బాగా దూరం అయిపోయింది. ఇలాంటి సమయంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ మూవీ ఇటీవలే విడుదలై ఏకంగా సెన్సేషన్ విజయాన్ని సాధించింది. ఇక వసూళ్లలో కూడా దూసుకుపోతుంది ఈ మూవీ. ఏకంగా 10 రోజుల్లోనే 600 కోట్ల కలెక్షన్స్ సాధించింది అని చెప్పాలి. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ప్రభాస్ ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

 అయితే ఇక ప్రభాస్ నటించిన సలార్ మూవీ 10 రోజుల్లో ఏకంగా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడంతో ప్రభాస్ ఒకసారి కొత్త చరిత్ర సృష్టించాడు. ఏకంగా 600 ప్లస్ కోట్ల రూపాయల క్లబ్లో చేరిన మూడు చిత్రాలలో నటించిన సౌత్ ఇండియా యాక్టర్ గా నిలిచాడు ప్రభాస్. గతంలో బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో ఈ రికార్డును సాధించాడు. ఇక ఇప్పుడు సలార్ సినిమా కూడా ఈ ఘనత సాధించింది అని చెప్పాలి. అయితే సలార్ మూవీ మరో రెండు రోజుల్లో ఏకంగా 1000 కోట్ల మార్కును కూడా అందుకుంటుంది అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: