తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న శ్రీకాంత్ తాజాగా కోట బొమ్మాలి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రాహుల్ విజయ్ , శివాని రాజశేఖర్ , వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రలో నటించగా తేజ మార్ని ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మిథున్ ముకుందన్ , రంజిన్ రాజ్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... జగదీశ్ చీకటి ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేశాడు. కార్తిక్ శ్రీనివాస్ ఆర్ ఈ మూవీ కి ఎడిటర్ గా పని చేయగా , బన్నీ వాస్, విద్య కొప్పినీడి ఈ సినిమాని జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు.
ఈ సినిమాను 2023 నవంబరు 24 తేదీన విడుదల చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకుని పరవాలేదు అని రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ వారు దక్కించుకున్నారు.
ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఇకపోతే తాజాగా ఆహా నిర్వాహక బృందం వారు ఈ సినిమాను ఎప్పుడు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు అనే విషయాన్ని ప్రకటించింది. ఆహా నిర్వాహక బృందం వారు కోట బొమ్మాలి సినిమాని ఈ సంక్రాంతికి తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నట్లు తాజాగా ఆహా సంస్థ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.