బింబిసారా-2 నుండి.. వశిష్ట తప్పుకున్నాడా.. కొత్త డైరెక్టర్ ఎవరంటే?

praveen
ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త దర్శకులదే హవా నడుస్తుంది. సరికొత్త కథలతో ప్రేక్షకులను పలకరిస్తూ సూపర్ హిట్లు దక్కించుకుంటున్నారూ. అయితే ఇలా మొదటి సినిమాతోనే అందరిని మిస్మరైజ్ చేశాడు వశిష్ట మళ్లీడి. ఏకంగా రిస్కీ కాన్సెప్ట్ అయినా టైం ట్రావెల్ జానర్ ఎంచుకొని ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు అనే విషయం తెలిసిందే. ఈ ఏడాది విడుదలైన బింబిసారా సినిమా అటు కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. డైరెక్టర్ వశిష్ట మళ్లీడికి కూడా మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పాలి.

 అయితే బింబిసారా సినిమా విడుదల కాకముందు ఈ సినిమాకు సీక్వల్ ఉంటుందని హీరో కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. ఇక ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో సీక్వెల్ పై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోయాయి అని చెప్పాలి. అయితే ముందుగా దర్శకుడు వశిష్ఠ తన రెండవ సినిమాను బింబిసార 2 నే తెరకెక్కిస్తాడు అని అందరూ అనుకున్నప్పటికీ స్క్రిప్ట్  పూర్తిగా కాకపోవడంతో ఇక మెగాస్టార్ తో ఒక సినిమా చేస్తున్నాడు. దీంతో ఇక బింబిసారా సీక్వెల్ ఆగిపోయినట్లేనా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల డెవిల్ మూవీ ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

 బింబిసార 2 కచ్చితంగా ఉంటుంది అంటూ పేర్కొన్నాడు కళ్యాణ్ రామ్. అయితే అది మొదటి భాగం తెరకెక్కించిన వశిష్ట దర్శకత్వం వహించడం లేదు అని ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ఇక వశిష్ట ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు కళ్యాణ్ రామ్ తెలిపారు. అయితే ఈ సీక్వెల్ దర్శకత్వ బాధ్యతలను అనిల్ పాదూరి తీసుకున్నాడట. ఈ దర్శకుడు గతంలో పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్  హీరోగా వచ్చిన రొమాంటిక్ మూవీ ని తెరకెక్కించాడు. ఇక బింబిసారా సినిమాకి విఎఫ్ఎక్స్ డిజైనర్ గా కూడా వర్క్ చేశాడు అనిల్ పాదూరి. దీంతో ఆయన బింబిసార సీక్వెల్ ఎలా హ్యాండిల్ చేస్తారో అని చర్చ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: