REWIND 2023 : డబ్ సినిమాలతో వచ్చి.. సూపర్ హిట్ కొట్టిన హీరోలు వీళ్లే?

praveen
సాధారణంగా తెలుగు సినీ ప్రేక్షకులందరికీ కూడా చాలా విశాల హృదయం అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే కేవలం తెలుగు హీరోలను మాత్రమే కాకుండా ఇతర భాషల నుంచి తెలుగులో డబ్ సినిమాలతో వచ్చిన హీరోలను కూడా ఆదరిస్తూ ఉంటారు. సినిమా బాగుండాలే కానీ ఇక హీరో ఎవరు అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా.. బ్లాక్ బస్టర్ ఇచ్చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అందుకే ఇటీవల కాలంలో ఇతర భాషల హీరోలు సైతం తమ సినిమాలను తెలుగులో విడుదల చేసి హిట్టు కొట్టాలని తెగ ఆశ పడుతున్నారు. ఇక ఇప్పటికే రజనీకాంత్, సూర్య, కమల్ హాసన్ లాంటి హీరోలు తెలుగులో స్టార్ హీరోలుగా వెలుగొందారు. అయితే 2023 ఏడాదిలో ఇలా తెలుగులో డబ్ చేసి సూపర్ హిట్ కొట్టిన హీరోలు ఎవరు  అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు చూసుకుంటే..

 విజయ్ : జనవరిలో సంక్రాంతి కానుకగా విజయ నటించిన వారసుడు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్. ఇది తెలుగు సినిమానా తమిళ్ సినిమానా అనే కాస్త క్లారిటీ మిస్సైంది. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వలేదు. కానీ యావరేజ్ గా నిలిచింది.
 షారుక్ ఖాన్ : బాలీవుడ్ బాద్షా షారుఖాన్ నటించిన పఠాన్, జవాన్ సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ సాధించాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇక్కడ కూడా భారీ వసూళ్లు రాబట్టాయి.
 ధనుష్ : ధనుష్ హీరోగా నటించిన బైలింగ్ వల్ మూవీ సార్. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.  మెసేజ్ ఓరియంటెడ్ గా వచ్చి ప్రేక్షకులను మెప్పించింది.
 రజనీకాంత్  :  వరుస ప్లాపులతో సతమతమవుతున్న సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమా ఎన్నో అద్భుతాలను క్రియేట్ చేసింది. డబ్బింగ్ సినిమాలలో ఇక ఈ సంవత్సరం తెలుగులో ఈ మూవీ భారీ సక్సెస్ అందుకుంది అని చెప్పాలి.

 రణబీర్ కపూర్  : సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాల్లో సూపర్ హిట్ అందుకున్న సినిమాగా నిలిచింది.
 ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పోనియన్ సిల్వన్ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రాఘవ లారెన్స్, ఎస్జె సూర్య లీడ్ రోల్ లో వచ్చిన జిగర్తాండ డబుల్ ఎక్స్ ఎల్, విశాల్ హీరోగా వచ్చిన మార్క్ ఆంటోనీ లాంటి సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. శివ కార్తికేయన్ హీరాగా వచ్చిన మహావీరుడు సినిమా మాత్రం ఇక ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: