రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సీజ్ పైర్ మూవీతో మరో బిగ్గెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల సునామీ కొనసాగిస్తుంది.ఈ నేపథ్యంలో 'సలార్ -2' సినిమా కూడా అంతకు మించి ఉంటుందని డార్లింగ్ రివీల్ చేయడంతో అంచనాలు ఆకాశానికి పెరిగిపోతున్నాయి. అసలైన యాక్షన్ రెండవ భాగంలో ఉంటుందని తేలిపోయింది. వివిధ దేశాల ఆర్మీలన్నీ ఒకవైపు ఉంటే? సలార్ ఆర్మీ ఒక్కటే? ప్రపంచ దేశాల ఆర్మీపై ఎలా తిరగబడ్డాడు? అనేది రెండవ భాగంలో చూపించనున్నారు.పార్ట్ -2 లో నెక్స్ట్ లెవల్ ప్రభాస్ చూపించనున్నాడని ఖచ్చితంగా తెలుస్తోంది. ఇదే స్పీడ్ లో నాగ్ అశ్విన్ ప్రభాస్ ని అంతకు మించి తన సినిమాలో చూపించబోతున్నట్లు తెలిపి హైప్ పెంచేశాడు. ప్రస్తుతం ఈ కాంబినేషనల్ లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కీ 2898 సినిమా ఎన్నో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా గురించి ముంబై ఐఐటీలో జరిగిన టెక్ పెస్ట్-23 లో చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.'ఈ సినిమా ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ. హాలీవుడ్ ప్యూచరిస్ట్ సినిమాల్లో అక్కడ సిటీలు ఫ్యూచర్లో ఎలా ఉంటాయో చూసాం. కల్కిలో ఇండియన్ సిటీలు భవిష్యత్ లో ఎలా ఉండనున్నాయో ప్రేక్షకులు చూస్తారు. ఇదొక భిన్నమైన సినిమా . ప్రతీ అంశం కూడా లోతుగా ఆలోచించి..స్క్రాచ్ నుంచి అన్నీ కొత్తగా డిజైన్ చేసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాం. ప్రేక్షకులు దీంట్లో ఖచ్చితంగా ప్యూచర్ ప్రభాస్ ని చూస్తారు.త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటిస్తాం. మరో 93 రోజుల తర్వాత ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఉండొచ్చు' అని అన్నారు. దీంతో కల్కి సినిమా గురించి సాలిడ్ అప్ డేట్ మార్కెట్ లోకి వచ్చినట్లు అయింది. ఇంతవరకూ ట్రైలర్ రిలీజ్ పై ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. నాగ్ అశ్విన్ తొలిసారి ట్రైలర్ గురించి..ప్రభాస్ పాత్ర గురించి అంచనాలు పెంచేసేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉండటంతో ఫ్యాన్స్ హైప్ తో చచ్చిపోతున్నారు.