సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ఈ చిత్త బృందం వారు పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం ప్యాచ్ వర్క్ మిగిలి ఉండడంతో దానిని ప్రస్తుతం పూర్తి చేస్తున్నారు.
ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. చిన బాబు , సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ మూవీ లో రమ్యకృష్ణ , జయరామ్ ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి మొదట దమ్ మసాలా అనే సాంగ్ ను విడుదల చేసింది. దీనికి సూపర్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఆ తర్వాత ఓ మై బేబీ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ విడుదల చేసింది. దీనికి జనాల నుండి మిక్స్ డ్ టాక్ లభించింది. ఇకపోతే నిన్న ఈ మూవీ బృందం వారు ఈ సినిమా లోని మూడవ సాంగ్ అయినటువంటి 'కూర్చి మడతపెట్టి" అంటూ సాగే సాంగ్ ప్రోమో ను విడుదల చేసింది.
దీనికి కొంత మంది ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా ... మరి కొంత మంది నుండి నెగటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ మూవీ లోని మూడవ సాంగ్ అయినటువంటి "కుర్చీ మడతపెట్టి" అంటూ సాగే పాట యొక్క ఫుల్ సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.