అఫీషియల్ : "కోట బొమ్మాలి" ఓటిటి విడుదలకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన సీనియర్ నటులలో శ్రీకాంత్ ఒకరు. ఇకపోతే ఈయన తాజాగా కోట బొమ్మాలి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ లో రాహుల్ విజయ్ , శివాని రాజశేఖర్ , వరలక్ష్మి శరత్ కుమార్ , మురళి శర్మ , బెనెర్జీ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. రంజిన్ రాజ్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... జగదీష్ చీకటి ఈ మూవీ కి కెమెరా మెన్ గా వర్క్ చేశాడు.


కార్తిక శ్రీని గావాస్ ఈ మూవీ కి ఎడిటర్ గా పని చేయగా ... బన్నీ వాస్, విద్య కొప్పినీడి ఈ మూవీ ని నిర్మించారు. తేజ మర్ని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ నవంబర్ 24, 2023 థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ మళయాళ చిత్రం "నాయట్టు" అనే సినిమాకి రీమేక్ గా రూపొందింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేసి మంచి విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.


ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ సంస్థ వారు దక్కించుకున్నారు. ఇకపోతే తాజాగా ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ వారు ఈ సినిమాని మరి కొన్ని రోజుల్లోనే తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: