మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. అందులో మొదటి భాగాన్ని 2024 ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో వచ్చే సంవత్సరం జనవరి 8 వ తేదీన ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లిమ్స్ వీడియో ద్వారా ఈ మూవీ మైన్ పాయింట్ ను అలాగే ఈ సినిమా యొక్క భారీతనాన్ని తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది. "ఆర్ ఆర్ ఆర్" లాంటి భారీ విజయం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే జాన్వీ కి తెలుగు తో పాటు ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ లభించే అవకాశం ఉంది. మరి ఈ మూవీ తో ముద్దుగుమ్మకు ఏ రేంజ్ క్రేజ్ వస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఈ నటి తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.