తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన
యువ నటీమణులలో
పాయల్ రాజ్పుత్ ఒకరు. ఈ
బ్యూటీ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన
ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ
మూవీ లో
కార్తికేయ హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్
సక్సెస్ అందుకుంది. అలాగే ఇందులో పాయల్ తన నటనతో ... అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దానితో వరుసగా ఈ బ్యూటీ.కి తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కాయి.
ఇకపోతే ప్రస్తుతం ఈ నటి
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
బ్యూటీ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మంగళవారం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను లభించింది. దానితో ఈ సినిమాకు
బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు లభించాయి.
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించి యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ
సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ
మూవీ యొక్క డిజిటల్ హక్కులను దక్కించుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ ఈ
మూవీ ని ప్రస్తుతం తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. ఇకపోతే ఈ
మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో సూపర్ రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ప్రస్తుతం ఈ
మూవీ డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ట్రెండింగ్ లో నెంబర్ 1 లో కొనసాగుతున్నట్లు తాజాగా డిస్నీ ప్లస్ సంస్థ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ
పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.