ఐదు రోజుల్లో సలార్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

frame ఐదు రోజుల్లో సలార్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సలార్ అనే భారీ యక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది అనే విషయాలను తెలుసుకుందాం.

ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 50.29 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 21.23 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 22.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 18.05 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 121.97 కోట్ల షేర్ ... 185.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా ... శృతి హాసన్ ఈ సినిమాలో ప్రభాస్ కి జోడి గా నటించింది. జగపతి బాబు , పృధ్విరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: