100 కోట్ల మూవీకి.. ఆ హీరో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదా?

praveen
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఇటీవల కాలంలో వరుసగా సూపర్ హిట్లు సాధిస్తూ దూకుడు మీద ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. రవికుమార్ దర్హకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది అని చెప్పాలి. ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో 2016 లోనే ఈ మూవీని అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత 2018 నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టారు.


 అయితే సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ లాంటి వాటికే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీంతో ఇక ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది అని చెప్పాలి. దాదాపు 5 ఏళ్ల పాటు ఇక ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది. ఎట్టకేలకు సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అయితే ప్రస్తుతం శివ కార్తికేయన్ అటు కోలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. వరుసగా హిట్లు సాధిస్తూ ఉన్నాడు. దీంతో ఒక్కో సినిమాకి దాదాపు 30 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నాడు అని చెప్పాలి. అయితే అటు అయాలాన్ కోసం మాత్రం శివ కార్తికేయన్ భారీ రెమ్యూనరేషన్ వదులుకున్నాడట.


 ఈ మూవీ కోసం శివ కార్తికేయన్  ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అన్న వార్త కాస్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ మూవీ ఒక ఏలియన్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుండగా ఈ ఏలియన్ పాత్రకు హీరో సిద్ధార్థ్ రెమ్యూనరేషన్ తీసుకోకుండానే ఉచితంగా డబ్బింగ్ చెప్పాడు. ఇక శివ కార్తికేయను కూడా పారితోషకంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. అయితే సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యి లాభాలు వస్తే ఇక లాభాల్లో వాటా తీసుకునే అవకాశం ఉంది అన్నది తెలుస్తోంది. ఇలా ఏకంగా సినిమా కోసం ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోకుండా ఇద్దరు హీరోలు పనిచేయడం గురించి తెలిసి ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: