ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ టీజర్ పై అప్డేట్ ఇచ్చిన అనిరుధ్..!!

Divya
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమా భారీ హైప్స్ ఏర్పడుతున్నాయి.. ప్రేక్షకుల అంచనాలను మించి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా ఈ చిత్రం కోసం చాలానే కష్టపడుతున్నారు. ఇటీవలే కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా ఇంటర్వ్యూలో భాగంగా దేవర సినిమా గురించి పలు విషయాలు తెలియజేశారు.. అయితే దేవర టీజర్ ఎప్పుడు విడుదలవుతుందని విషయం పైన మాత్రం సరైన స్పష్టత ఇవ్వలేదు కంటెంట్ ఓకే అనిపించిన తర్వాతే తేదీని కూడా అనౌన్స్మెంట్ చేస్తామంటూ తెలియజేశారు.
కానీ ఇప్పుడు తాజాగా దేవర సినిమా నుంచి టీజర్ సిద్ధం అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకు సంబంధించి సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. దేవర చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా అనిరుద్ సంగీతాన్ని ఇవ్వడంతో ఈ సినిమా మొదటినుంచి మంచి బజ్ ఏర్పడుతోంది. గత కొన్నేళ్లుగా అనిరుధ్ అందించిన సంగీతాలు ఆల్మోస్ట్ భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. ఇటీవల కాలంలో వచ్చిన విక్రమ్ ,జైలర్ ,లియో తదితర చిత్రాలకు సైతం సంగీతాన్ని అందించారు.

ఇదంతా ఇలా ఉండగా దేవర సినిమా టీజర్ను ఉద్దేశించి  అనిరుధ్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ షేర్ చేశారు. దేవర సినిమా టీజర్ అని రాసి పక్కన చప్పట్లు కొడుతున్న కొన్ని ఏమోజీలను కూడా షేర్ చేశారు.. దీంతో ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.. అనిరుద్ కూడా సంగీతాన్ని సమకూర్చినట్లుగా తెలుస్తోంది. టీజర్ లో ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తారు కొరటాల శివ అన్నట్లుగా పోస్ట్ వేశారని స్పష్టంగా కనిపిస్తోంది.. దీంతో అనిరుద్ పెట్టిన ఈ హ్యాష్ ట్యాగ్  సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.#AllHaithe tiger అనే ది వైరల్ గా మారుతుంది. దీని అర్థం పులికి అందరూ సలాం కొడతారని అర్థమట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: