ఎట్టకేలకు తన కూతుర్ని పరిచయం చేసిన ఆలియా- రణబీర్..!!

Divya
బాలీవుడ్ సెలబ్రిటీ జోడీగా పేరుపొందిన వారిలో రణబీర్ కపూర్, ఆలియా భట్.. 2002లో వీరి వివాహం జరిగింది. ఇక పెళ్లయిన ఏడు నెలలకే ఇద్దరు తల్లిదండ్రులుగా ప్రమోషన్స్ అందుకున్నారు.. నవంబర్ 6వ తేదీన ఆలియా రాహాకు జన్మనిచ్చింది.. అప్పటినుంచి ఈ స్టార్ కపుల్స్ ఇంతవరకు తన కూతురి ఫేస్ను సైతం రివీల్ చేయలేదు.. అయితే ఇప్పుడు తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో రాహా ఫేస్ ని అభిమానులకు చూపించడం జరిగింది. మొదటిసారి తన కూతుర్ని ఆలియా భట్ రణబీర్ ఇద్దరు కలిసి చూపించడం జరిగింది.


ప్రస్తుతం రాహాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు సైతం రాహాకు తన ముత్తాత పోలికలు వచ్చాయంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు .బాలీవుడ్లో అగ్ర నటుడుగా పేరు పొందిన రాజ్ కపూర్ కి.. రణబీర్ కపూర్ మనవడు అనే విషయం అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా రాజ్ కపూర్ కి ఎక్కువగా బ్లూ ఐస్ ఉంటాయట. ఇప్పుడు రణబీర్ కూతురికి కూడా అలాగే సేమ్ కనిపిస్తున్నాయని పలువురు అభిమానులు నెటిజన్ సైతం తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం ఈమెకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.మరి కొంత మంది చాలా క్యూట్ గా ఉందంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. రణబీర్ సినీ కెరియర్  విషయానికి వస్తే రీసెంట్గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.ఈ సినిమా కూడా తండ్రి సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు 850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో రణబీర్ కెరియర్ మారిపోయిందని చెప్పవచ్చు. ఈ సినిమా ఓటీటి కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 26న ఈ సినిమా ఓటీటి లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: