మరో శివగామేనా శ్రీయా రెడ్డి..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు నటిగా మంచి పాపులారిటీ సంపాదించింది నటి శ్రీయ రెడ్డి.. ఇటీవల సలార్ సినిమాలో ఈ ఆమ్మడి పాత్ర గురించి తెగ వైరల్ గా మారుతోంది.మల్టీ టాలెంటెడ్ నటి కావడంతో ఈమెకు తగ్గ రోల్ పడిందని ఆమె అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. చేసింది ఈమె కొన్ని సినిమాల అయినప్పటికీ తన నటనతో తనదైన మార్కును ఏర్పరచుకుంది శ్రీయా రెడ్డి.. సలార్ సినిమాలో వరదరాజు సోదరి పాత్రలో మరొకసారి అదరగొట్టేసింది ఈ అమ్మడు. ముఖ్యంగా ఈమె లుక్స్ కి సైతం నటనకు సైతం మంచి మార్కులే పడ్డాయి.


శ్రియా రెడ్డి పాత్రని ఏకంగా బాహుబలి శివగామి పాత్ర చేసిన రమ్యకృష్ణ పాత్రతో పోలుస్తున్నారు అభిమానులు. శ్రీయా రెడ్డి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఈమె సీనియర్ నటి 2002లో సుమురాయ్ అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అప్పుడప్పుడు అనే సినిమాతో కూడా తెలుగు తెరకు లాంచ్ అయ్యింది శ్రీయా రెడ్డి ఆ తర్వాత అమ్మ చెప్పింది. అనే చిత్రంలో కూడా నటించింది. ఇవేవీ పెద్దగా గుర్తింపు రాలేదు కానీ.. విశాల్ నటించిన పొగరు సినిమాతో మరొకసారి మంచి క్రేజ్ ను అందుకుంది.


అందులో పొగరుబోతు లేడి విలన్ గా కనిపించిన శ్రియా రెడ్డి తన నటనతో నెక్స్ట్ లెవెల్లో క్రేజ్ అందుకుంది. ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ అందుకున్న ఈమె 2008 హీరో విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణతో వివాహం జరిగింది. ఆ తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె గత ఏడాది వరకు యూఎస్ఏ లో ఉండేవారు. మధ్యలో ఒకటి రెండు సినిమాలలో చేసిన పెద్దగా కంటిన్యూ కాలేకపోయింది. కానీ సలార్ సినిమాతో కం బ్యాక్ అదిరిపోయేలా ఉందంటే ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రంలో కూడా ఈమె కీలకమైన పాత్రల నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: