'చెప్పవే చిరుగాలి.. చల్లగా ఎద గిల్లి.. ఎక్కడే వసంతాల కేళి' అనే సాగే సాంగ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ అని చెప్పొచ్చు.ఎప్పుడో 20 ఏళ్ల క్రితం విడుదలైన
బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు సినిమాలోని ఈ పాటకు
మణిశర్మ అందించిన బాణీలు అయితే ఎవర్ గ్రీన్. అప్పుడు
బాలీవుడ్ స్టార్ సింగర్
ఉదిత్ నారాయణ్ పాడిన ఈ పాటను ఇప్పుడు మన
సూపర్ స్టార్ మహేశ్ పాడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి!.. ఇప్పుడు ఈ న్యూస్ నిజం కాబోతుంది.మహేశ్ బాబు.. ప్రస్తుతం మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం వంటి ఊర
మాస్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ
మూవీ సంక్రాంతి పండుగ కానుకగా చాలా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీలో
హీరోయిన్ ను ఇంప్రెస్ చేయడానికి మహేశ్ బాబు ఈ చెప్పవే చిరుగాలి పాటను పాడనున్నారట.అయితే పాట కాదని.. కేవలం ఫస్ట్ రెండు లైన్లను మాత్రమే
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన స్టైల్ లో పాడినట్లు సమాచారం. ఈ సీన్ ఖచ్చితంగా
సూపర్ స్టార్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుందట.
మహేశ్ బాబు స్టైలిష్ గా పాట పాడుతూ
హీరోయిన్ ను ఇంప్రెస్ చేస్తుంటే థియేటర్లలో ఈలలే ఈలలంట.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సరైన
మసాలా డోస్ ఇచ్చేలా ఆ సీన్ ను చిత్రీకరించారట.ప్రస్తుతం ఈ
సినిమా షూటింగ్
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జరుగుతోందట.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల మధ్య కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారట మేకర్స్.అలాగే ఓ
మాస్ సాంగ్ కూడా షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇంకా అదే సమయంలో
మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయట. ఎలా అయినా
సంక్రాంతి పండుగ కానుకగా
జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట.గుంటూరు కారం మూవీలో మహేశ్, శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరీ కూడా లీడ్ రోల్ పోషిస్తోంది. అలాగే సీనియర్ నటులు జగపతిబాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్,
సునీల్ ఇంకా రఘబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిన్ క్రియేషన్స్ పై రాధాకృష్ణ,
సూర్యదేవర నాగవంశీ మూవీని నిర్మిస్తున్నారు.
జనవరి 6వ తేదీన
హైదరాబాద్ లో ఈ
మూవీ ప్రీరిలీజ్
ఈవెంట్ జరగనుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.