అలాంటి సినిమాలు ప్రభాస్ కే సూట్ అవుతాయంటున్న ఫ్యాన్స్....!!

murali krishna
కొన్ని సినిమాలు కొంతమంది హీరోలకు మాత్రమే సూట్ అవుతాయి. ఆ సినిమాలలో మరో హీరోను ఊహించుకోవడం కూడా సాధ్యం కాదు. బాహుబలి, సలార్ సినిమా లు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంతో పాటు కలెక్షన్ల పరం గా సంచలనాలు సృష్టించాయి. సలార్ సినిమా బాహు బలి కలెక్షన్లను బ్రేక్ చేయడం కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజసానికి మారు పేరు ప్రభాస్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాహుబలి సలార్ లాంటి సినిమా లు ప్రభాస్ కే సూటవుతాయంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ రేంజ్ కు తగిన విజయాలు రాబోయే రోజుల్లో దక్కాలని ఫ్యాన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. సలార్ తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన ప్రభాస్ భవిష్యత్తు సినిమా లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.ప్రభాస్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతున్నా పారితోషికం మాత్రం పరిమితం గా తీసుకుంటున్నారు. 100 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రభాస్ పారితోషికం తీసుకుంటుండగా 300 కోట్ల రూపాయలకు తగ్గకుండా ప్రభాస్ సినిమా లకు బిజినెస్ జరుగుతోంది. ప్రభాస్ సలార్ సినిమా సక్సెస్ తో బాక్సాఫీస్ దద్దరిల్లుతోంది. కలెక్షన్ల విషయం లో ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. సోమవారం వరకు సలార్ దూకుడుకు బ్రేకులు వేయడం సాధ్యం కాదని చెప్పవచ్చు. మంగళవారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతు న్నాయో చూడాల్సి ఉంది. సలార్ రిలీజ్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రాజెక్ట్ కే సినిమాపై పడింది. సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుం టుందో చూడాల్సి ఉంది. ఒకింత భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే మూవీ తెరకెక్కడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: