శ్రీదేవి - రజనీకాంత్ తో ఉన్న ఈ చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి సంబంధించి ఏ చిన్న విషయం తెర మీదకి వచ్చినా కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో స్టార్ హీరోలకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫొటోస్ కొన్ని ఇంటర్నెట్లో ప్రత్యక్షమవుతూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే ఇక ఇలాంటి చైల్డ్ హుడ్ ఫొటోస్ చూసి అందులో ఉన్న హీరో ఎవరో కూడా గుర్తుపట్టడం కొన్ని కొన్ని సార్లు అభిమానులకే కష్టతరం అవుతూ ఉంటుంది అని చెప్పాలి.

 ఇక ఇటీవల కాలంలో ఇలాంటి ఫోటోలు చాలానే ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతున్నాయి. ఇక ఇప్పుడు దివంగత నటి శ్రీదేవి సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఉండి చిరునవ్వులు చిందిస్తున్న బుడ్డోడి ఫోటో వైరల్ గా మారిపోయింది. ఇక అతనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఫిట్నెస్ కి అతను కేర్ ఆఫ్ అడ్రస్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించాడు. అతని నటనకు కోట్లాదిమంది అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక వ్యక్తిగత విషయాలతో కూడా ఎన్నోసార్లు వార్తలు నిలిచాడు అతను. ఇక అతన్ని అమ్మాయిల కలల రాకుమారుడు అని కూడా అంటూ ఉంటారు.

 ఇంతలా ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారు కదా. అతను ఎవరో కాదు బాలీవుడ్ గ్రీక్ బాడ్ హృతిక్ రోషన్  1986లో రజనీకాంత్ నటించిన భగవాన్ దాదా సినిమాలో హృతిక్ రోషన్ బాలు నటుడిగా కనిపించాడు. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ఈ సినిమాకు నిర్మతగా వ్యవహరించారు. ఇందులో రజనీకాంత్ సరసన దివంగత నటి శ్రీదేవి జంటగా నటించారు. ఇక ఆ తర్వాత హృతిక్ 2000 సంవత్సరంలో రాకేష్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన కహోనా ప్యార్ హై చిత్రంతో బాలీవుడ్లోకి హీరోగా అడుగు పెట్టాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలు తీస్తూ ఎన్నో సూపర్ హిట్ లని కూడా ఖాతాలో వేసుకున్నాడు హృతిక్ రోషన్ అని చెప్పాలి. కాగా హృతిక్ చిన్నప్పటి ఫోటోలు చూసి ఫాన్స్ కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: