ఝమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి తాప్సి. మంచు మనోజ్ హీరోగారికి రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు పరీక్షకులకు పరిచయమైనటువంటి ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే పరవాలేదు అనిపించుకున్నారు.ఇక ఈ సినిమా తర్వాత సినిమాలలో నటించినప్పటికీ తెలుగులో పెద్దగా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. ఇలా ఈమె తెలుగులో సక్సెస్ కాకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోలతో కలిసి నటించినటువంటి ఈమెకు అక్కడ మంచి సక్సెస్ లభించింది. అయితే ఈమె ఇప్పటి వరకు పెద్ద హీరోలతో సినిమాలు చేయలేదు. అలాగే ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ ఉండేవారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో తాప్సి ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలోనే నటించారు. అయితే ఈమె లేడీ సినిమాలలో నటించడానికి కూడా కారణం లేకపోలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా నెపోటిజం ఉందని ఈమె కామెంట్ చేశారు. ఇకపోతే సీనియర్ సెలబ్రిటీలు ఎవరు కూడా తమ సినిమాలలో చిన్న హీరోలు హీరోయిన్లకు అవకాశాలు కల్పించారని కూడా తెలియజేశారు.
ఒకవేళ అవకాశాలు ఇచ్చిన హీరోయిన్ల పాత్రకు ప్రాధాన్యత ఉండదని హీరోయిన్ లని కేవలం గ్లామర్ షో కి మాత్రమే తీసుకుంటున్నారంటూ గతంలో ఎన్నో సందర్భాలలో ఈమె బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలపై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో నటించి సక్సెస్ అందుకోవాలని ఈమె గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి తాప్సి తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సినిమాలో కూడా నటించే అవకాశాలను అందుకున్నారు. ఇటీవల ప్రముఖ డైరెక్టర్ రాజ్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించినటువంటి డంకీ సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిసెంబర్ 21వ తేదీ కేవలం హిందీ భాషలో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. ఇక ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరచడంతో మరోసారి తాప్సికి బాలీవుడ్ ఇండస్ట్రీలో చేదు అనుభవమే ఎదురైంది. స్టార్ హీరో సినిమాలో నటించి హిట్ కొట్టాలన్న ఈమె కల ఈ సినిమాతో నెరవేరలేదని చెప్పాలి. మరి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల పక్కన నటించి మంచి సక్సెస్ అందుకోవాలి అన్నటువంటి ఈమె కల నెరవేరుతుందా లేదా అన్న సంగతి తెలియాల్సి ఉంది.