యానిమల్ సినిమా సాంగ్ కి బిగ్ బాస్ దివి డాన్స్..!!
ఈమధ్య చాలా మంది ఈ పాట పైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు కూడా జమాల్ సాంగ్కు డాన్స్ వేస్తూ రీల్ చేస్తూ తెగ సందడి చేస్తూ ఉన్నారు. తాజాగా తెలుగు బిగ్ బాస్ బ్యూటీగా పేరుపొందిన దివి కూడా తన వర్షన్ లో ఈ జమాల్ డాన్స్ చేయడం జరిగింది. గ్లాసును తల మీద పెట్టుకొని బాబీ డియోల్ ఒరిజినల్ వర్షన్ లో అలాగా డాన్స్ చేస్తూ ఉన్నది.. అలాగే గాజు గ్లాస్ ను చేతిలో పట్టుకొని మరి తాగుతూ యాక్టింగ్ చేస్తూ డాన్స్ వేయడం జరిగింది.
మొత్తానికి ట్రెండీగా అవుతున్న జమాల్ పాటకు బిగ్ బాస్ దివి డాన్స్ వేయడంతో అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ సారీ ని కట్టుకొని ఈ పాటకు డాన్స్ వేయడం చాలా అట్రాక్షన్ గా నిలుచుంది. తను ఏదో సినిమాలో నటిస్తున్న షూటింగ్ మధ్యలో ఇలా జమాల్ పాటకు డాన్స్ చేసినట్లుగా తెలియజేయడం జరిగింది. ఈ వీడియో చూసిన అభిమానుల సైతం చీరకట్టిలో దివి సూపర్ గా ఉందంటు కామెంట్స్ చేయడమే కాకుండా డాన్స్ తో కూడా ఫిదా అయ్యేలా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతున్నది.