సలార్ సినిమాని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

Divya

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్. ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఈ చిత్రానికి అద్భుతమైన డైరెక్షన్ వహించారు. విడుదలైన అన్ని భాషలలో కూడా ప్రేక్షకులను మెప్పించింది. కీలకమైన పాత్రలలో పృధ్విరాజ్ సుకుమార న్ నటించడం జరిగింది. అలాగే జగపతిబాబు విలన్ గా నటించాక హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. అలాగే శ్రియా రెడ్డి కూడా ఒక విభిన్నమైన పాత్రలో నటించినట్లు తెలుస్తోంది.మొదట ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ ని ఎంపిక చేయలేదట.


బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఆలియా భట్ rrr చిత్రం తో మంచి పాపులారిటీ సంపాదించు కుంది. మార్కెట్ పరంగా కూడా ఆలియా భట్ కు మంచి సక్సెస్ ఉందని ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఈమెను సంప్రదించినట్లుగా సమాచారం. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఆలియా సలార్ సినిమాలో కూడా తీసుకోవాలని ఆలోచించగా.. ప్రభాస్ నటించిన చిత్రాలు అప్పటివరకు భారీగా ఫ్లాపులవుతున్నాయని నమ్మకం లేక ఇమే ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం.


అలా ఆలియా భట్ రిజెక్ట్ చేసిన వెంటనే హీరోయిన్గా శృతిహాసన్ ఎంపిక చేశారట. ఏది ఏమైనా ఆలియా భట్ రిజెక్ట్ చేయడం తప్పే అంటూ అభిమానుల సైతం తెలియజేస్తున్నారు . ఈ సినిమా మొత్తం ఇద్దరి స్నేహితుల మధ్య కథాంశంతో ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు ప్రశాంతి నిల్. శృతిహాసన్ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించడం జరగడంతో కచ్చితంగా ఈ సినిమా శృతిహాసన్ కు మరింత ప్లస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఆలియా భట్ అభిమానులు మాత్రం తెలిసి తెలిసి తమ హీరోయిన్ ఇలాంటి సినిమాలు వదులుకోవడం ఏంటి అంటే పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: