ఇండియా వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన
రియాల్టీ షో లలో
బిగ్ బాస్ ఒకటి. ఇది ఇండియాలో మొదట
హిందీ లో ప్రారంభమైంది.
హిందీ లో ఈ షో కు అద్భుతమైన రెస్పాన్స్ లభించడంతో ఆ తర్వాత ఈ షో ను
ఇండియా లోని చాలా భాషలలో లాంచ్ చేశారు. అందులో భాగంగా తెలుగు లో కూడా
బిగ్ బాస్ ను మొదలు పెట్టారు. ఇకపోతే మొదట తెలుగు
బిగ్ బాస్ సీజన్ 1 కి యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత రెండవ సీజన్ కి నాచురల్ స్టార్
నాని హోస్ట్ గా వ్యవహరించాడు.
ఇకపోతే ఇప్పటి వరకు తెలుగు లో మొత్తం 7 బుల్లి తెర
బిగ్ బాస్ షో లు ... ఒక "ఓ టి టి" షో పూర్తి అయింది. ఇకపోతే బుల్లి తెర
బిగ్ బాస్ 3 వ సీజన్ నుండి మొన్నటి 7 వ సీజన్ వరకు అలాగే "ఓ టి టి" మొదటి సీజన్ కి కూడా
నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. ఇకపోతే తాజాగా
బిగ్ బాస్ "ఓ టి టి" షో కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ...
బిగ్ బాస్ నిర్వాహక బృందం వారు ఇప్పటికే మరికొన్ని రోజుల్లో తెలుగు
బిగ్ బాస్ "ఓ టి టి" సీజన్ 2 ను ప్రారంభించే పనిలో ఉన్నట్లు అందుకు సంబంధించిన పనులను కూడా ఇప్పటికే ప్రారంభించినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అలాగే అన్ని అనుకున్నట్లు జరిగితే తెలుగు
బిగ్ బాస్ "ఓ టి టి" సీజన్ 2 ను వచ్చే సంవత్సరం
మార్చి నెల నుండి మొదలు పెట్టే ఆలోచనలో
బిగ్ బాస్ బృందం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ముగిసిన
బిగ్ బాస్ "ఓ టి టి" సీజన్ 1 కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.