నేను డార్క్ షేడ్ లో మూవీస్ తీయడానికి.. కారణం అదే : ప్రశాంత్ నీల్

praveen
సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరి కెరియర్ ఎలా మలుపు తిరుగుతుంది అని ఊహించడం చాలా కష్టం. అయితే ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకునేందుకు ఎంతో మంది దర్శక నిర్మాతలు హీరోలు కూడా ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇక ఎన్ని సినిమాలు తీసిన సరైన గుర్తింపు రాక నిరాశ చెందుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇంకొంతమంది మాత్రం తమలో ఉన్న టాలెంట్ ను ప్రేక్షకులు మెచ్చే విధంగా చూపించి తక్కువ సినిమాల్లోనే ఊహించని రీతిలో క్రేజ్ సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి దర్శకులలో ప్రశాంత్ నీల్ కూడా ఒకరు అని చెప్పాలి.


 ప్రశాంత్ నీల్ కెరియర్ లో తిప్పి కొడితే కనీసం ఐదు సినిమాలు కూడా చేయలేదు. కానీ స్టార్ డైరెక్టర్ కాదు ఇక అందరికి మించిన తోపు డైరెక్టర్ అనే పేరును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా అతని దర్శకత్వంలో వచ్చిన కే జి ఎఫ్ సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఏకంగా సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రశాంత్ నిల్. ఈ మూవీలో ప్రభాస్ హీరోగా నటించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఇక అతను ఏదైనా సినిమా తీశాడు అంటే ప్రేక్షకులందరూ బ్రహ్మరథం పడుతూ ఉంటారు. అయితే ప్రశాంత్ నీల్ సినిమాలు చూసిన ప్రేక్షకులందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది. అందరూ దర్శకులు కలర్ఫుల్ గా ఉండే సినిమాలు తీస్తూ ఉంటే.. ఎందుకు ప్రశాంత్ నీల్ మాత్రం డార్క్ షేడ్ లోనే సినిమాలు తీస్తాడని. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ డార్క్ షెడ్ లోనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ మూవీ కూడా అదే రీతిలో ఉంది అని చెప్పాలి. ఈ విషయంపై ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఎక్కువ కలర్స్ అంటే నాకు నచ్చదు. నాకు అదొక రకమైన ఓసిడి. నా మెంటాలిటీ ప్రతిబింబించే విధంగానే నా సినిమాలోని కలర్స్ ఉంటాయి అంటూ ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: