గుంటూరు కారం: విడుదలకు ముందే రికార్డులు గల్లంతు?

Purushottham Vinay
టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త మూవీ గుంటూరు కారం.. ఆతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి.అసలు ఇప్పటికే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు గుంటూరు కారం సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అవ్వడంతో అందుకు తగ్గట్టుగా సినిమాని రెడీ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే గుంటూరు కారం మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ , గ్లింప్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి, మహేష్ మాస్ అవతార్ కు ఫ్యాన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు.గుంటూరు కారం సినిమా నుంచి ఇప్పటిదాకా రెండు పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటి పాట దమ్ మసాలా సాంగ్ ప్రేక్షకులను ఎంతో విపరీతంగా ఆకట్టుకుంది.రెండో  పాటపై కొంతమంది విమర్శలు గుప్పించారు.



ఇక ఈ మూవీ రిలీజ్ కు 20 రోజుల సమయం మాత్రమే ఉంది. దాంతో మేకర్స్ కూడా స్పీడ్ పెంచారు. అతి త్వరలోనే వరుసగా గుంటూరు కారం అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఈ మూవీ ట్రైలర్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే గుంటూరు కారం అడ్వాన్స్ బుకింగ్స్ యూకే లో ఓపెన్ అయ్యాయి. యూకే లోని కొన్ని థియేటర్స్ లో గుంటూరు కారం మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అవి క్షణాల్లో అమ్ముడయ్యాయి. కేవలం కొద్దిసేపటిలోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడయ్యాయని సమాచారం తెలుస్తోంది. అతి త్వరలోనే యూఎస్ లోనూ బుకింగ్స్ ను ఓపెన్ చేయనున్నారట. ఇంకా అలాగే గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్, అలాగే ట్రైలర్ పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఈ మూవీతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఖచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవడం ఖాయం అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: