టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కెరీర్ పరంగా బాగా బిజీగా ఉంది.రీసెంట్ గా విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. ఆ మూవీ తర్వాత వెండితెరపై కనిపించలేదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఎప్పుడు చూసినా ఎక్కువగా సోషల్ మీడియాలోనే దర్శనమిస్తోందామె. ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత నటిస్తోన్న హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్.బాలీవుడ్ హాట్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ సిరీస్ సిటాడెల్కు ఇండియన్ రీమేక్‌గా ఈ సిరీస్ తెరకెక్కుతోంది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. అయితే చాలా రోజుల క్రితమే సిటాడెల్ షూటింగ్ ప్రారంభమైంది. ఇక సమంత కూడా తన షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేసింది. అయితే ఇప్పటి దాకా సిటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్‌పై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. దీనికి సంబంధించి అప్ డేట్స్ కూడా ఆగిపోయాయి. అయితే ఈ సిరీస్ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే.. సిటాడెల్ సిరీస్ మే చివరి వారం లేదా జూన్ ఫస్ట్ వీక్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని సమాచారం తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిటాడెల్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మార్చి నెల నుంచి సిటాడెల్ సిరీస్ ప్రమోషన్లలో సమంత పాల్గొననున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఫ్యామిలీ మ్యాన్-1,2, ఫర్జీ వెబ్ సిరీస్‌లతో సంచలనం సృష్టించిన దర్శకులు డీకే రాజ్ సిటాడెల్ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. సమంత, వరుణ్ ధావన్ ఇందులో స్పై ఏజెంట్లుగా నటిస్తున్నారు. అతి త్వరలోనే సిటాడెల్ వెబ్ సిరీస్ కు సంబంధించి అప్డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. కాగా ఈ సంవత్సరం శాకుంతలం, ఖుషి ల్లో నటించింది సమంత. రెండు ప్లాప్ అయ్యాయి. ఖుషి రిలీజ్ రోజే విదేశాలకు వెళ్లిపోయింది సమంత. మయోసైటిస్ చికిత్స కోసమే ఆమె అమెరికా వెళ్లిందని అప్పుడు వార్తలొచ్చాయి. అదే సమయంలో ఓ హాలీవుడ్ ఆడిషన్స్‌కు కూడా వెళ్లిందని ప్రచారం సాగింది. అయితే దీనిపై సమంత ఎలాంటి ప్రకటన చేయలేదు.