మెగా హీరో మూవీని లాక్ చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ....!!
ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టనుంది.ఆపరేషన్ వాలెంటైన్ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహిస్తున్నారు. ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్‍కు హెడ్‍గా కెప్టెన్ రుద్ర పాత్రను ఈ మూవీలో చేశారు వరణ్ తేజ్. హీరోయిన్ మానుషి చిల్లర్ కూడా ఈ ఆపరేషన్‍లో ఉంటారు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లుగా పని చేసే ఇద్దరూ ప్రేమలో పడినట్టు టీజర్లో ఉంది. లవ్ స్టోరీ కూడా ఈ సినిమాలో ప్రధానంగా ఉండేలా కనిపిస్తోంది.
ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకు హరి కే వేదాంతం సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. టీజర్లో విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీల్లో ద్విభాషా చిత్రంగా ఆపరేషన్ వాలెంటైన్ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‍తోనే ఈ మూవీ రూపొందుతోంది.ఆపరేషన్ వాలెంటైన్ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. "మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్‍ది కూడా" అనే డైలాగ్ టీజర్లో హైలైట్‍గా నిలిచింది.