కళ్యాణ్ రామ్ న్యూ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా సంయుక్త మీనన్ ....??
అయితే ఈ సినిమా వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అందరిని అద్భుతంగా ఆకట్టుకుంటుంది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని నందమూరి కళ్యాణ్ రామ్ అభిమానులు ఇప్పటికే మంచి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి నేపథ్యంలో కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే నెక్స్ట్ ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడనే టాకైతే వినిపిస్తుంది.
మరీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి. ఇక ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా సంయుక్త మీనన్ని తీసుకోవడం విశేషం... ఎందుకంటే ఇప్పటికే కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాలో కూడా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో కూడా తననే రిపీట్ చేస్తూ మళ్ళీ హీరోయిన్ గా తీసుకోవడం అనేది నిజంగా మంచి విషయం అనే చెప్పాలి... ఇక ఈ హిట్ కాంబో ని రిపీట్ చేస్తూ మరో మంచి సక్సెస్ ని కొట్టడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ సినిమాతో మరోసారి సక్సెస్ కొట్టి హిట్ పెయిర్ గా నిలుస్తారని సినిమా యూనిట్ మంచి ఆశ భావాన్ని వ్యక్తం చేస్తుంది.