పవన్ కళ్యాణ్ సినిమాలో పల్లవి ప్రశాంత్ కి అవకాశం దక్కెనా....??
కేవలం తెలంగాణ స్లాంగ్ మాత్రమే కాదు, ఆడియన్స్ కి కొత్తగా అనిపించే ఏ స్లాంగ్ సినిమా అయినా ఆడేస్తున్నాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' చిత్రం తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ సినిమాలో ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ అంబటి ఒక పాత్రకి ఫిక్స్ అయిపోయాడు. స్వయంగా డైరెక్టర్ బుచ్చి బాబు బిగ్ బాస్ స్టేజి మీద ఈ ప్రకటన చేసాడు. ఇప్పుడు రామ్ చరణ్ కి సహాయ నటుడి పాత్రలో పల్లవి ప్రశాంత్ ని తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ బుచ్చి బాబు. పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ సందర్భాల్లో జనాల చేత కంటతడి పెట్టించేస్తాడు.
కాబట్టి పల్లవి ప్రశాంత్ కచ్చితంగా అలాంటి పాత్రలకు న్యాయం చెయ్యగలడు కాబట్టి, ఆయనకీ ఆ కోణం లో సినిమా అవకాశాలు మెండుగా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమా తో పాటుగా పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం లో నటించే ఛాన్స్ దక్కిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా, మరికొంత మంది మేకర్స్ కూడా పల్లవి ప్రశాంత్ ని తమ సినిమాలో తీసుకుంటే మంచి పబ్లిసిటీ వస్తుందని భావిస్తున్నారు. చూడాలి మరి రాబొయ్యే రోజుల్లో ప్రశాంత్ రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది.