తంగలాన్: పర్ఫెక్షన్ కోసం డైరెక్టర్ షాకింగ్ డెసిషన్?

Purushottham Vinay
తమిళ స్టార్ హీరో విక్రమ్ హీరోగా చేస్తోన్న మరో విభిన్న స్టోరీ తంగలాన్. కబాలి డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రెడీ అవుతోన్న ఈ మూవీ కొలార్డ్ గోల్డ్ ఫీల్డ్ లో జరిగిన రియల్ సంఘటనల స్ఫూర్తితో రానుంది.తంగలాన్ అనే ఒక కమ్యూనిటీ తన ఉనికి కోసం చేసిన పోరాటమే ఈ సినిమా.ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్  క్యూరియాసిటీ పెంచింది. ఈ సినిమాలో విక్రం బక్కపలచగా ఒంటిపైన ఎలాంటి డ్రెస్ లేకుండా కేవలం చిన్న గోచితోనే కనిపించాడు. సినిమా మొత్తం అతని పాత్ర అలాగే ఉంటుందంట. ఒక అడవిజాతికి చెందినవాడిగా హీరో విక్రమ్ కనిపిస్తున్నాడు. పైగా సినిమాలో అతని పాత్రకి ఎలాంటి డైలాగ్స్ లేవని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.శివపుత్రుడు సినిమాలో చియాన్ విక్రమ్ విభిన్న పాత్రలో నటించిన అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ ఉంటాయి.అయితే తంగలాన్ మూవీలో మాత్రం అస్సలు సంభాషణలు లేకుండానే పా రంజిత్ ఆ పాత్రని బలమైన హీరోయిజంతో డిజైన్ చేసారు.



ఇదిలా ఉంటే ఈ మూవీని జనవరి 26న సౌత్ భాషలతో పాటు హిందీలో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని డేట్ కూడా ఫిక్స్ చేశారు.అయితే అనూహ్యంగా ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో పెర్ఫెక్షన్ కోసం మరింత టైం తీసుకోవాలని డైరెక్టర్ రంజిత్ అనుకుంటున్నారంట. ఈ కారణంగా సినిమా రిలీజ్ ని వచ్చే ఏడాది వేసవి సీజన్ ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది. దీంతో విక్రమ్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడుతున్నారు.అయితే దీనిపై మేకర్స్ అధికారికంగా ఇంకా స్పందించలేదు. కాని త్వరలోనే పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. పొన్నియన్ సెల్వన్ మూవీ తర్వాత విక్రమ్ చేస్తోన్న సినిమా ఇదే కావడంతో తమిళనాట ఈ మూవీపై భారీ హైప్ నెలకొని ఉంది. దానిని అందుకోవడం కోసం, విజువల్ ఎఫెక్ట్స్  బెటర్ మెంట్ చేయడం కోసం పా రంజిత్ సినిమాని వాయిదా వేస్తున్నారని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: