చీర కట్టులో క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న మీనాక్షి చౌదరి..!

frame చీర కట్టులో క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న మీనాక్షి చౌదరి..!

Pulgam Srinivas
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరియు కోలీవుడ్ ఇండస్ట్రీ లలో వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత కిలాడి , హిట్ ది సెకండ్ కేస్ మూవీ లలో నటించి తెలుగు లో మంచి గుర్తింపును సంపాదించుకుంది.  ప్రస్తుతం ఈ నటి మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.
 


ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ విజయ్ ఆంటోనీ హీరోగా రూపొందిన హత్య అనే తమిళ సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీ లలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటి కప్పుడు పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటి కి సంబంధించిన ఈ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: