షాక్: మద్యం డ్రగ్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శృతిహాసన్..!!
ఆ తర్వాత దాదాపుగా కొన్ని సంవత్సరాలపాటు సినీ ఇండస్ట్రీలో స్టార్డం అందుకున్న శృతిహాసన్ మధ్యలో లవ్ బ్రేకప్ రూమర్స్ వల్ల శృతిహాసన్ కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చింది.. ఆ సమయంలో శృతిహాసన్ ఎక్కువగా మధ్యానికి బానిస అయ్యానని పార్టీ కల్చర్స్ కు అలవాటు పడిపోయిందని రూమర్స్ కూడా వినిపించాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శృతిహాసన్ పలు విషయాలను తెలియజేయడం జరిగింది.. గతంలో తనకు తాగుడు అలవాటు ఉండేదని తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చింది.
అయితే ఆ అలవాటు నుంచి దూరమయ్యానని దాదాపుగా 8 ఏళ్ల నుంచి మద్యానికి దూరంగా ఉన్నానని తెలిపింది.. ప్రస్తుతం తన జీవితం చాలా సాఫీగా సాగుతోందని మళ్లీ జీవితంలో ఎప్పుడు చెడు అలవాట్లకు బానిస కాకూడదని నిర్ణయాన్ని ఎనిమిది ఏళ్ళ క్రితమే తీసుకున్నానని తెలిపింది.. తనకి తాగుడు అలవాటు ఉన్నప్పటికీ డ్రగ్స్ జోలికి ఎప్పుడు వెళ్లలేదని శృతిహాసన్ తెలియజేయడం జరిగింది.. కొంతమంది కావాలని తనకు అలాంటి అలవాట్లు చేయించారని మద్యం నుంచి బయటపడి వారిని దూరం పెట్టారని తెలియజేసింది శృతిహాసన్.. శృతిహాసన్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో నటించిన ఈ సినిమా ఏడాది డిసెంబర్ 22వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే నాని నటించిన హాయ్ నాన్న చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది.