నా వెనుక ఉన్న కొండంత బలం తగ్గిపోయినట్టు అనిపించింది :: జూ.ఎన్టీఆర్
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఒక షోలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ చేసిన వాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ తన తాత సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఒకసారి నన్ను మా అమ్మను మా తాతగారు కూర్చోబెట్టి నా మనవడిని నా అంత వాడిని చేయాలని చెప్పారు. నా అంత వాడిని చేయడంలో మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించండి నా వంతు బాధ్యత నీరు నిర్వర్తిస్తాను అని తెలిపారు. కానీ ఆయన చనిపోయారు. నాకు కొండంత శక్తి ఆయనే. నాకు ఎందుకో తెలియదు మా తాతగారు అంటే పిచ్చి ఒక రకంగా చెప్పాలంటే మా తాత గారికి నేను ఎడిక్ట్ అయిపోయాను. కానీ ఆయన ఎప్పుడైతే చనిపోయారో నా వెనుక ఉన్న కొండంత బలం తగ్గిపోయినట్టు అనిపించింది. ఇక కొండంత బలం తగ్గిపోతే ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను. అలా తాతగారి మరణం నాలో సగం ధైర్యాన్ని చంపేసింది. నా లైఫ్ లో నాకు బాధగా అనిపించిన సందర్భం అంటే ఇది ఒకటే ఇంతకు మించిన బాధ నా లైఫ్ లో ఇంకా ఏమీ ఉండదు అని తెలిపారు ఎన్టీఆర్. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.