టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటి మనులలో ఒకరు అయినటువంటి పాయల్ రాజ్ పుత్ తాజాగా మంగళవారం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. అజయ్ భూపతి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడమ థియేటర్ లలో విడుదల అయ్యి మంచి టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది. ఇకపోతే ఈ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధించింది అనే విషయాలను తెలుసుకుందాం.
ఈ సినిమా నైజాం ఏరియాలో 4.12 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.49 కోట్లు , యు ఏ లో 1.18 కోట్లు , ఈస్ట్ లో 70 లక్షలు, వేస్ట్ లో 48 లక్షలు , గుంటూరు లో 69 లక్షలు , కృష్ణ లో 51 లక్షలు , నెల్లూరు లో 31 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.48 కోట్ల షేర్ ... 17.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇక కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 2.02 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇక ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 11.50 కోట్ల షేర్ ... 21.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు 12 కోట్ల మేర ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 13 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ లెక్కన బట్టి చూస్తే ఈ సినిమా మరో 1.50 కోట్ల రేంజ్ లో నష్టాలను అందుకొని యావరేజ్ మూవీగా నిలిచింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని నటనకు గాను పాయల్ రాజ్ పుత్ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ లో నందిత శ్వేత ఓ కీలకమైన పాత్రలో నటించింది.