మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఈగల్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు . కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాలో కావ్య తప్పర్ , అనుపమ పరమేశ్వరన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు . ఇక పోతే ఈ మూవీ షూటింగ్ చివరికి దశకు వచ్చిన నేపథ్యంలో రవితేజ మరో మూవీని స్టార్ట్ చేయబోతున్నాడు. గత కొన్ని రోజులు గా రవితేజ, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఆ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా కొన్ని రోజుల క్రితమే వెలువడింది. ప్రముఖ నిర్మాత టి జి విశ్వప్రసాద్ ... పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ మూవీ ని నిర్మించబోతున్నాడు. ఈ సినిమాలో యానిమల్ బ్యూటీ తృప్తి డింరీ హీరోయిన్ గా నటిస్తున్నట్టు ఓ వార్త చాలా వైరల్ అయింది. ఇక తాజాగా అసలు ఈ మూవీ లో హీరోయిన్ ఎవరో అనే విషయాన్ని ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా ... ఈ సినిమాతోనే భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనున్న భాగ్య శ్రీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా అందులో ఈ బ్యూటీ అదిరిపోయే గ్లామరస్ లుక్ లో ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.