మెగాస్టార్
చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్
బ్లాక్ బస్టర్ అందుకున్నాడు..అదే
జోష్ లో
మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా
శంకర్ సినిమాలో నటించారు. కానీ ఊహించని విధంగా భోళా
శంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీనితో
మెగాస్టార్ తన తరువాత సినిమాను యంగ్
డైరెక్టర్ తో చేస్తున్నారు. బింబిసార సినిమాతో
బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వశిష్ఠ తో
మెగాస్టార్ తన 156 వ సినిమాను చేస్తున్నారు.. మెగా 156 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ
సినిమా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. రీసెంట్ గానే ఈ
సినిమా షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే.టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ పతాకంపై వంశీ,ప్రమోద్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ తో ఈ
మూవీ షూటింగ్ ని మొదలెట్టారు. షూటింగ్ జరుగుతుండగానే ఇటీవల
తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు
చిరంజీవి విరామం తీసుకుని
హైదరాబాద్ కి వచ్చారు. ఓ సరికొత్త
ఊహా ప్రపంచం నేపథ్యంలో ఈ
సినిమా సాగనుంది. కాగా సినిమాలో
చిరంజీవి సరసన పలువురు
హీరోయిన్స్ ని మేకర్స్ ఇప్పటికే పరిశీలించారు. వారిలో సీనియర్
హీరోయిన్ అనుష్క శెట్టి మెగాస్టార్ సరసన ఫిక్స్ అయినట్లు గతంలో వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు మరో
హీరోయిన్ త్రిష పేరు బయటకు వచ్చింది.ఈ
సినిమా కోసం
అనుష్క శెట్టి ఆశించిన స్థాయిలో బరువు తగ్గకపోవడంతో ఆ అవకాశం
చెన్నై బ్యూటీ
త్రిష కు దక్కినట్లు సమాచారం.
త్రిష ఈ ఏడాది కొన్ని పొన్నియన్ సెల్వన్ మరియు లియో వంటి సినిమాలతో పాన్
ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేస్తోంది. అయితే చాలా రోజుల నుంచి
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వాలని
త్రిష ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పుడు
మెగాస్టార్ సినిమాతో త్రిషకి ఆ అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు
చిరంజీవి స్వయంగా
త్రిష పేరును
మూవీ టీం కి రిఫర్ చేసినట్లు సమాచారం.. గతంలో
చిరంజీవి,
త్రిష కాంబినేషన్లో 'స్టాలిన్'
మూవీ వచ్చిన విషయం తెలిసిందే.త్వరలోనే మేకర్స్ నుంచి ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాకి 'విశ్వంభర' అనే టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతోంది.
ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం. ఎం
కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు