హరీష్ శంకర్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న పవన్ టార్గెట్ !

Seetha Sailaja
హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో ప్రారంభం అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. చాల సంవత్సరాలు తరువాత పవన్ పోలీసు పాత్రలో కనిపిస్తున్న పరిస్థితులలో ఈ మూవీ విడుదల గురించి పవన్ అభిమానులు మాత్రమే కాకుండా సగటు సినిమా అభిమానులు కూడ చాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



ఈసినిమా షూటింగ్ ప్రారంభం అయి దాదాపు 10 నెలలు గడిచిపోతున్నా ఈమూవీ షూటింగ్ ఏమాత్రం ముందుకు సాగడం లేదు. దీనితో దర్శకుడు హరీష్ శంకర్ తెగ టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీని నిర్మించబోతున్న మైత్రీ మేకర్స్ కూడ ఈమూవీని ఎప్పుడు మళ్ళీ ప్రారంభం చేస్తారు అన్న విషయమై స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నట్లు లీకులు వస్తున్నాయి.



ఈసినిమా కథ స్క్రిప్ట్ ఫైనలేజేషన్ కోసం చాలకాలం ఎదురు చూసిన హరీష్ శంకర్ కు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది మార్చి ఏప్రియల్ నెలలలో జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణరంగంలో పవన్ బిజీగా ఉండటంతో ఇప్పట్లో పవన్ ఈమూవీ షూటింగ్ స్పాట్ కు రాలేదు అన్నస్పష్టమైన క్లారిటీ హరీష్ శంకర్ వచ్చింది. ఈలోపున రవితేజా తో ఒక సినిమాను చేయాలని ప్రయత్నించినప్పటికీ ఆసినిమాకు బడ్జెట్ పరంగా ఏర్పడిన సమస్యలు వల్ల ఈమూవీ కూడ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో హరీష్ శంకర్ కు తెలియని పరిస్థితి అంటున్నారు.



‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ పవన్ కు హరీష్ శంకర్ ఇచ్చినప్పటికీ పవర్ స్టార్ తో మరొక సినిమాను చేయడానికి హరీష్ శంకర్ కు ఎందుకు ఇన్ని కష్టాలు అడ్డంకులు ఏర్పడుతున్నాయో అతడికి కూడ తెలియని పరిస్థితి అని అంటున్నారు. ప్రస్తుతం పవన్ తో సినిమాలు చేస్తున్న సుజిత్ క్రిష్ ల పరిస్థితి కూడ ఇలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తి అయి తిరిగి పవన్ కెమెరా ముందుకు రావడానికి జూన్ నెల వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: