ఓటీటీ లో ఏంట్రీ ఇచ్చేసిన వీరప్పన్ బయోపిక్....!!

murali krishna
స్మగ్లర్ వీరప్పన్‌ పై ఇప్పటికే అనేక చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ వీరప్పన్ బయోపిక్‌ గా కిల్లింగ్ వీరప్పన్ అనే మూవీ ని తెరకెక్కించారు.తాజా గా కూసే మునిస్వామి వీరప్పన్ అనే డాక్యుమెంటరీ సిరీస్‌ వీరప్పన్ బయోపిక్ గా వస్తోంది.అడవుల్లోకి పారిపోయి తలదాచుకున్న బందిపోటు దొంగ కూసే మునిస్వామి వీరప్పన్ జీవితానికి సంబంధించి లోతైన అధ్యయనం చేసి ఈ ఒరిజినల్‌ను రూపొందించారు.వీరప్పన్‌ కు సన్నిహితులైన వారి నుంచి వివరాలను సేకరించడం, అదేవిధంగా ఆయన్ని పట్టుకోవటానికి ప్రయత్నించిన అధికారుల నుంచి సేకరించిన వీడియోను ఈ డాక్యుమెంటరీ లో పొందుపరిచారు. ఇది వీరప్పన్ రహస్య జీవితాన్ని అలాగే అతని నేర వారసత్వాన్ని స్పష్టం గా ఆవిష్కరించింది. ఈ సిరీస్ ముందు వీరప్పన్ నెరేషన్‌ తో ప్రారంభమవుతుంది. అతని పూర్తి జీవితాన్ని ఆవిష్కరిస్తూనే అతని చుట్టూ జరిగిన ఘటన లను గురించి కూడా తెలియజేస్తుందని మేకర్స్ ఇదివరకే తెలిపారు.కూసే మునస్వామి వీరప్పన్ ఒరిజినల్‌ ను తమిళ, తెలుగు, హిందీ మరియు కన్నడ భాషల్లో ప్రముఖ ఓటీటీ జీ5 లో డిసెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, మొదట డిసెంబర్ 8 నుంచి ప్రసారం చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించగా చెన్నై లో వరదల కారణంగా స్ట్రీమింగ్ వాయిదా వేశారు. ఇప్పుడు డిసెంబర్ 14 నుంచి జీ5 లో కూసే మునిస్వామి వీరప్పన్ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేస్తున్నారు.కాగా వీరప్పన్‌ ను పట్టుకోవటానికి మూడు దశాబ్దా ల పాటు తమిళ నాడు, కేరళ మరియు కర్ణాటక అడవుల లో పోలీసులు ఎంత గానో అన్వేషించారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో న స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ చేసిన ఎన్‌కౌంటర్‌ లో వీరప్పన్ మరణించారు. అయితే ఈ సిరీస్‌ లో వీరప్పన్ స్వయంగా నెరేషన్ ను ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: