ఆ ఇద్దరు యంగ్ హీరోలతో శ్రీలీల కి చేదు అనుభవం..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న నటీమణులలో శ్రీ లీల ప్రథమ స్థానంలో ఉంటుంది అని చెప్పడంలో ఏ మాత్రం వెనకాడాల్సిన పనిలేదు. ఈ ముద్దు గుమ్మ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఇందులో ఈ నటి తన అందంతో ... నటనతో ... డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల ఈ బ్యూటీ కి తెలుగు లో వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.


ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో దాదాపు 8 నుండి 10 సినిమాల వరకు ఉన్నాయి. అందులో కొన్ని అత్యంత భారీ క్రేజ్ ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తన కెరీర్ లో ఇప్పటి వరకు నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు మాత్రమే అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ కొంత కాలం క్రితం రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద అనే మూవీ లో హీరోయిన్ గా నటించిన విషయం మనకు తెలిసిందే.


భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే తాజాగా ఈ నటి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. నితిన్ హీరోగా రూపొందిన ఈ మూవీ కి వక్కంతం వంశీ దర్శకత్వం వహించాడు. ఇక మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ముద్దు గుమ్మకు నిరాశనే మిగిల్చింది. ఇలా ఈ ఇద్దరు యంగ్ హీరోలు తమ మూవీ లతో ఈ బ్యూటీ కి చేదు అనుభవాన్ని మిగిల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: