సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా నాలుగు 200 కోట్ల బ్లాక్ బస్టర్ సిబిమాల తరువాత మరో బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. సర్కారు వారి పాట సినిమా తర్వాత మరో సినిమా రిలీజ్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ ఇప్పుడు రాబోయే సినిమా కోసం ఆకలితో ఉన్నారు. ఇక ఎప్పుడు తమ హీరో సినిమా రిలీజ్ అవుతుందా ఎప్పుడు ఆ సినిమాతో రికార్డులు బద్దలు కొడదామా అని ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ''గుంటూరు కారం''.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను చాలా రిచ్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాపై అటు ఆడియెన్స్ తో పాటు ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. దీంతో షూట్ కూడా eఆల్మోస్ట్ పూర్తి చేసి రిలీజ్ కు రెడీ అవుతున్నారు.
మరి ఈ సినిమాకు ఇంకా 30 రోజుల టైం మాత్రమే ఉంది.. దీంతో మేకర్స్ తాజాగా ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఇక మేకర్స్ పోస్ట్ చేస్తూ ''రమణ దెబ్బ దవడ అబ్బా హుయ్'' అంటూ మరో నెల రోజులు మాత్రమే ఉంది రెడీగా ఉండండి అంటూ పోస్ట్ చేసారు. చూడాలి మరి ఈ మూవీ సంక్రాంతి రేసులో ఎంతటి విజయం సాధిస్తుందో..ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు విలన్ గా కనిపిస్తున్నాడు.. ఇక ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వాయిస్ ఓవర్ ఇవ్వాలని త్రివిక్రమ్ ట్రై చేస్తున్నాడట. ఈ న్యూస్ తో అటు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇంకా సూపర్ స్టార్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.