టాలీవుడ్
యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఈయన తన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో నటించాడు. కానీ వాటి ద్వారా ఈయనకు పెద్దగా గుర్తింపు లభించలేదు. ఇకపోతే పోయిన సంవత్సరం ఈ నటుడు
డీజే టిల్లు అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ
మూవీ లో
నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ...
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ
నిర్మాత సూర్య దేవర
నాగ వంశీ ఈ
మూవీ ని నిర్మించాడు. మంచి అంచనాల నడుమ
థియేటర్ లలో విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
అలాగే ఈ సినిమాలో సిద్దు బాడి లాంగ్వేజ్ , డ్రెస్సింగ్ స్టైల్ , డైలాగ్ డెలివరీ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఈ
మూవీ తో ఒక్క సారిగా సిద్దు క్రేజ్ తెలుగు లో అమాంతం పెరిగి పోయింది. ఇకపోతే ఈ
మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వల్ గా టిల్లు స్క్వేర్ అనే
మూవీ ని రూపొందిస్తున్నారు. ఈ
మూవీ లో సిద్దు హీరోగా నటిస్తూ ఉండగా ... అనుపమ పరమేశ్వరన్
హీరోయిన్ గా నటిస్తుంది.
సూర్య దేవర
నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ
మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.
ఈ
మూవీ ని మరికొంత కాలంలోనే విడుదల చేయబోతున్నారు. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దు "డీజె టిల్లు"
మూవీ సీక్వెల్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా సిద్దు మాట్లాడుతూ ... ఈ సిరీస్ లో
మూవీ లో ఇప్పట్లో ఆగవు. ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒక్కో
మూవీ వస్తూనే ఉంటుంది అని తెలియజేశాడు. ఇకపోతే ప్రస్తుతం సిద్దు "టిల్లు స్క్వేర్"
మూవీ తో పాటు "తెలుసు కదా" అనే సినిమాలో కూడా
హీరో గా నటిస్తున్నాడు. ఇందులో
రాశి కన్నా ,
శ్రీ నిధి శెట్టి
హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు.