ఆ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న వెంకీ... అది కానీ చేసుంటే..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే విక్టరీ వెంకటేష్ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే వెంకీ కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను తన కెరీర్ లో మిస్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.


అలా వెంకటేష్ తన కెరియర్ లో మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ లలో జెర్సీ మూవీ ఒకటి. అసలు జెర్సీ మూవీ ని వెంకటేష్ మిస్ చేసుకోవడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం ... నాని హీరో గా రూపొందిన జెర్సీ మూవీ కి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు.  గౌతమ్ ఈ మూవీ కథను మొత్తం రెడీ చేసుకున్న తర్వాత వెంకటేష్ వద్దకు వెళ్లి ఈ సినిమా కథను వినిపించాడట. వెంకటేష్ కు కూడా ఈ మూవీ కథ అదిరిపోయే రేంజ్ లో నచ్చిందట. కాకపోతే అదే సమయంలో వెంకటేష్ ఇతర సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండడం వలన ఈ సినిమాకు డేట్ లను అడ్జస్ట్ చేయలేకపోయాడట.


ఆ తర్వాత ఈ మూవీ దర్శకుడు ఇదే సినిమా కథను నాని కి వివరించగా ... నాని కి ఈ సినిమా కథ అద్భుతంగా నచ్చడంతో వెంటనే ఈ మూవీ లో నటించడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ... ఆ తర్వాత జెర్సీ అనే టైటిల్ తో ఈ మూవీ ని రూపొందించడం ... ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగిపోయింది. ఇక ఈ విషయం బయటకు వచ్చాక వెంకటేష్ అభిమానులు ఈ సినిమా మా హీరో చేసి ఉంటే అదిరిపోయే రేంజ్ లో ఉండేది అని అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్ "సైందవ్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే నెల థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: