నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలను ఇప్పటి వరకు అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈయనకు "యూ ఎస్ ఏ" లో కూడా అద్భుతమైన మార్కెట్ ఉంది. అందులో భాగంగా ఈయన నటించిన చాలా సినిమాలు "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 1 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి. ఇప్పటి వరకు నాని కెరియర్ లో 9 సినిమాలు "యూ ఎస్ ఏ" లో 1 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి.
ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం. నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 7 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే "యూ ఎస్ ఏ" లో 1 మిలియన్ కలెక్షన్ లను అందుకుంది. నాని ఈ సంవత్సరం దసరా అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కూడా "యూ ఎస్ ఏ" లో 1 మిలియన్ కలెక్షన్ లను అందుకుంది.
ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. నాని కొంత కాలం క్రితం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన అంటే సుందరానికి మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా వన్ మిలియన్ కలెక్షన్ లను "యూ ఎస్ ఏ" లో అందుకుంది. ఈ మూవీ తో పాటు నాని హీరోగా రూపొందిన నిన్ను కోరి , ఈగ , నేను లోకల్ , జెర్సీ , భలే భలే మగాడివోయ్ , ఎంసీఏ సినిమాలు కూడా "యు ఎస్ ఎ" లో 1 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి. ఇలా మొత్తంగా నాని కెరియర్ లో 9 సినిమాలు "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 1 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి.