కాబోయే భర్తతో డాన్స్ వేస్తున్న జబర్దస్త్ పవిత్ర..!!

Divya
తెలుగులో ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కామెడీ షో ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ షోలో ఎంతోమంది ఆర్టిస్టులు సైతం సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అవుతూ ఉన్నారు. అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆర్టిస్టులలో జబర్దస్త్ పవిత్ర కూడా ఒకరు.. జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.జబర్దస్త్ ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఒకవైపు జబర్దస్త్ మరొకవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో కూడా నటిస్తూ బిజీగా ఉంది. అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ భారీగానే సంపాదిస్తోంది.

ఇదంతా ఇలా ఉండగా తాజాగా పవిత్ర తనకు కాబోయే భర్తను సైతం పరిచయం చేయడంతో పాటు ఒక రొమాంటిక్ డాన్స్ ని కూడా షేర్ చేస్తూ వీడియోని షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది. గత కొద్ది రోజుల క్రితం తమ ప్రేమ విషయాన్ని ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా కొన్ని ఫోటోలను సైతం తెలియజేయడం జరిగింది. సంతోష్ అనే వ్యక్తిని ఈమె త్వరలోనే వివాహం చేసుకోబోతోందని తెలుస్తోంది ఇంకా పెళ్లి తేదీని అయితే ఈ జంట ప్రకటించలేదు.

తాజాగా పవిత్ర ఒక వీడియోని షేర్ చేస్తూ తన ఇంస్టాగ్రామ్ లో తెలియజేసింది. ఈ వీడియోలో పవిత్ర తన బాయ్ ఫ్రెండ్ సంతోష్ తో కలిసి లోఫర్ సినిమాలోని రొమాంటిక్ సాంగ్లో డాన్స్ వేయడం జరిగింది. ఈ వీడియో రాసుకొస్తూ కొన్ని సిచువేషన్ లో మనకి డాన్స్ వేయడం రాకపోవచ్చు ఏం చేయాలో తెలుసా అంటూ డాన్స్ వచ్చినట్లుగా మేనేజ్ చేయాలి అంటూ ఈ వీడియో కి జత చేసి ఈ వీడియోని పోస్ట్ షేర్ చేయడం జరిగింది.. తన బాయ్ ఫ్రెండ్ తనకి ముందుగా ప్రేమని ప్రపోజ్ చేశారని ఆ తర్వాత కొంతకాలానికి ఓకే చెప్పానని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: