25 ఏళ్లుగా నాతోనే ఉన్నారు అంటు ఎమోషనల్ పోస్ట్ చేసిన సిమ్రాన్..!!

Divya
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో హీరోయిన్ సిమ్రాన్ కూడా ఒకరు.. తెలుగు తమిళ భాషలలో వరుసగా ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించింది. అప్పట్లో హీరోయిన్ సిమ్రాన్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సిమ్రాన్ మొదట బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ వచ్చింది. ఆ తర్వాత తమిళ్ తెలుగు అంటే చిత్రాలలో నటించి మరింత క్రేజ్ అందుకుంది సిమ్రాన్ తన నటనతోనే కాకుండా గ్లామర్ తో కూడా అందరిని ఆకట్టుకుంది. ఎంతమంది స్టార్ హీరోలతో కూడా నటించింది సిమ్రాన్. ఎంతోమంది హీరోలకు సరైన జోడిగా కూడా సిమ్రాన్ నిలిచి అభిమానులను బాగా ఆకట్టుకుంది.

ప్రస్తుతం సిమ్రాన్ తన సెకండ్ ఇన్నింగ్స్ సైతం మొదలుపెట్టి తన నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలోని నటిస్తూ బిజీగా ఉన్నది. ఈమె నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో తన నటనతో అందరిని అబ్బురపరిచింది.తాజాగా సిమ్రాన్ ఒక ఎమోషనల్ పోస్ట్ని సైతం షేర్ చేయడం జరిగింది. ఈ పోస్టు కాస్త వైరల్ గా మారుతున్నది. సిమ్రాన్ మేనేజర్ కామరాజన్ పలు అనారోగ్య కారణాలతో మృతి చెందారు.. దీంతో సిమ్రాన్ ఒక ఎమోషనల్ సైతం షేర్ చేసింది.

తన మేనేజర్ మరణాన్ని నమ్మలేకపోతున్నానని 25 ఏళ్లుగా ఆయన తన వెంటే ఉన్నారని కుడి భుజంగా ఆయన ఎప్పుడూ తన పక్కనే ఉండే వారిని తెలియజేసింది సిమ్రాన్.. కామ రాజన్ చాలా యాక్టివ్ గా ఉండేవారని ఆయన లేకుండా తన సినీ ప్రయాణాన్ని సైతం అసలు ఊహించు కోలేకపోతున్నానంటూ ఎమోషనల్ కావడం జరిగింది సిమ్రాన్. కామ రాజన్ కుటుంబ సభ్యులకు తన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ తెలియజేయడం జరిగింది. సిమ్రాన్ కొడుకును కూడా త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న సిమ్రాన్ పెద్దగా ఆకట్టుకోలేక పోతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: